KRNL:రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ అన్నారు. హొళగుంద మండల కేంద్రంలోని స్థానిక కడ్లెమాగి గ్రామ ప్రధాన రహదారిని రూ.3.60 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు భూమి పూజా కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.