AP: గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తామని CM చంద్రబాబు తెలిపారు. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకెళ్తామంటే ఒక పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశమన్నారు. తనకు 2 ప్రాంతాలు.. రెండు కళ్లతో సమానమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని.. గోదావరిపై ప్రాజెక్టులు కట్టి.. నీళ్లు తీసుకోవాలని TGకి సూచించారు.