ప్రకాశం: అమృతలూరు మండల పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులు నీటి తీరువా బకాయిలు త్వరగా చెల్లించాలని మండల తహశీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మండల గ్రామాల్లోని రైతుల పంట పొలాల నీటి తీరువా బకాయిలు వెంటనే గ్రామ సచివాలయాల ద్వారా చెల్లించాలని కోరారు.