TG: రూ.30 వేల కోట్ల విలువైన భూముల అమ్మకానికి సర్కారు పన్నాగం పన్నారని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ద్వంద్వనీతికి, రెండు నాల్కల ధోరణికి ఇది ఉదాహరణ అని పేర్కొన్నారు. నాడు భూములు అమ్మొద్దని రేవంత్ రెడ్డి సుద్దులు చెప్పారని, ఇవాళ ప్రభుత్వ భూములు అమ్మకానికి టెండర్లు వేశారని తెలిపారు. పీసీసీ చీఫ్గా ఒక మాట, సీఎం కాగానే మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.