KDP: ప్రొద్దుటూరు రామేశ్వరం ఎస్పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా 56 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. డాక్టర్ మౌనిక మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో 10 శాతం మందికి దృష్టిలోపం ఉందన్నారు. విద్యార్థులు కంటి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.