ATP: ఎన్ఏటీఎస్ (నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీం)ను యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా అన్నారు. గుత్తిలోని ఎమ్మెస్ డిగ్రీ కళాశాలలో మెప్మా-ఆశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ఏటీఎస్పై డిగ్రీ పూర్తి చేసిన యువతీ, యువకులకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ శిక్షణను పర్యవేక్షించారు.