PPM: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబరులో మహిళా దినోత్సవ వేడుకలపై సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మహిళలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.