ఛత్తీస్గఢ్ ధామ్తారి జిల్లాలోని మాదగిరి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు నక్సల్స్ మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. DRG సైనికులు నక్సలైట్ల శిబిరాన్ని ధ్వంసం చేశారు. కొండ ప్రాంతంలో 30 మంది నక్సలైట్లు ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.