NLR: కోవూరు గ్రామపంచాయతీ పరిధిలో శనివారం ఉదయాన్నే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. మండలంలోని పలు ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి నాటకరాణి వెంకట్ పాల్గొన్నారు.