AKP: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ కోర్సులలో 26,161 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిణి బి.సుజాత తెలిపారు. బాలికలు 10,616 మంది, బాలురు 15,545 మంది హాజరవుతున్నారని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతంలో ఏడు పరీక్ష కేంద్రాలు, రూరల్ ప్రాంతాలలో 27 పరీక్ష కేంద్రాలు కలిపి 34 ఏర్పాటు చేశామన్నారు.