బాపట్ల: దాదాపు 30ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లి నివాసంలో ఆయన తోడల్లుడు, మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిశారు. తాను రాసిన “ప్రపంచ చరిత్ర” (ఆది నుంచి నేటి వరకు) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురించి మాట్లాడేందుకు డా.దగ్గుబాటి CM ఇంటికి వెళ్లారు. ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహణపై చర్చించి సీఎంను ఆహ్వానించారు.