కృష్ణ: వీరులపాడు మండలం పొన్నవరంలోని ఏకత్వా పాఠశాలలో అండర్-14 బాల, బాలికల ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆదివారం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి నాగం సతీష్ బాబు తెలిపారు. ఈ ఎంపికలు ఈ నెల 25న మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించనున్నట్లు వివరించారు.