PDPL: జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. యూరియా నిల్వలు తనిఖీ చేసి వివరాలు తెలుసుకుని యాసంగిలో సాగు విస్తీర్ణం మేరకు రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37, 000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు.