KNR: ఓటమి భయంతోనే తనపై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోటీలో ఉన్నది విద్యావేత్తలు కాదని, వ్యాపారవేత్తలని విమర్శించారు. ఎన్నికలు సజావుగా జరగట్లేదని అన్నారు. అభ్యర్థులందరూ డబ్బుల కట్టలతో టికెట్ తెచ్చుకున్నారని, పట్టభద్రులు మోసపోకుండా తనకు ఓటు వేయాలని కోరారు.