KNR: పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని MLC ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 24 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.