GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రాన్ని దేవాదాయ డిప్యూటీ సెక్రటరీ తులసీ, ఎస్ఓ మాధవస్వామి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్ ప్రహ్లాద రావు, అర్చకులు మధుసూదన చారి వారిని సాదరంగా ఆహ్వానించి స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఛైర్మన్ ఆలయ విశిష్టతను వారికి వివరించారు.