కోనసీమ: కూటమి వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పిలుపునిచ్చారు. మలికిపురం వైసీపీ కార్యాలయంలో RCPM కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్తో కలిసి ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి వాటిని అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు.