ప్రకాశం: దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. పట్టణంలోని దివ్యాంగుల హక్కుల ఐక్యవేదిక కార్యాలయంలో దాతల సహకారంతో మదర్ సేవా సమితి ఏర్పాటుచేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్లను పంపిణీ చేశారు.