KKD: పెద్దాపురం డివిజన్లో గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఆదివారం సాయంత్రం అధికారులు ప్రకటించారు. సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో జరిగిన గ్రూప్-2 పరీక్షలకు 6,460 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 5,665 మంది హాజరయ్యారని యూనివర్సిటీ డిప్యూటీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.