CTR: వెదురుకుప్పం మండలం కన్నికాపురంలో ఆదివారం జల్లికట్టు సంబరాలు అంబరాన్నంటాయి. జల్లికట్టు సంబరాలకు మండలంలోని పరిసర ప్రాంతాల నుంచి వందలాది కోడెగిత్తలతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జల్లికట్టులో యువత ఎంతో ఉత్సాహంగా తమ కోడెగిత్తలు పందెంలో పాల్గొనడానికి ఎగబడ్డారు.