NDL: జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.