TG: SLBC టన్నెల్ లోపల భయానక పరిస్థితి ఉందని మంత్రి జూపల్లి అన్నారు. సొరంగం లోపలికి వెళ్లి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నారు. రెస్క్యూ టీమ్‌లు టన్నెల్ బోర్ మిషన్‌కు చేరువగా వెళ్లాయి. నీటి ఉద్ధృతికి బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చింది. కార్మికుల నుంచి ఎలాంటి శబ్దాలు రావట్లేదు. కార్మికుల విషయంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు’ అని తెలిపారు.