ASR: రానున్న అసెంబ్లీ సమావేశాల్లో గిరిజన ప్రాంతంలో 100 శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మన్నపడాల్, ఉపాధ్యక్షులు దాసు డిమాండ్ చేశారు. ఆదివారం పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును కలిసి వినతి అందజేశారు. ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అసెంబ్లీలో చెప్పాలని కోరారు.