KRNL: సివిల్ సప్లై హమాలీల కూలిరేట్లకు సంబంధించి పెంచిన కొత్త కూలిరేట్ల జీవోను వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సివిల్ సప్లై హమాలి యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ గూడూరులో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. దాదాపు 13 నెలలుగా పెంచిన కూలి రేట్లు రూ. 25 నుండి రూ. 28 సంబంధించిన జీవోను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు.