ELR: పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ పామ్ గెలలు ఏరివేత ఆపేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ, ఆయిల్ పామ్ రైతులు ఆదివారం ఎంపీకు విజ్ఞప్తి చేసి వినతిపత్రం అందజేశారు.