SKLM: సరుబుజ్జిలి మండలంలో ముంగన్న కొండపై పనిచేస్తున్న క్వారీ కార్మికులు ఆదివారం ఆందోళన చేశారు. ఈ కొండ క్వారీ వద్ద సుమారు 150 కుటుంబాలు రాళ్లు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నామని, దీనిని కొందరు అడ్డుకోవడంతో జీవనోపాధి పోతోందన్నారు. క్వారీలో రాళ్లు కొట్టే పని దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ సమస్యను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.