NDL: ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, చేపలు వంటివి ఆరగించి ఎంజాయ్ చేస్తారు. అయితే పాణ్యం మండలంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలసిన ఎస్.కొత్తూరులో ఆదివారం నాన్ వెజ్ పదార్థాన్ని అసలు ముట్టరు. చికెన్, మటన్ ఇతర ఏ నాన్ వెజ్ ఐటమ్స్‌ను గ్రామంలో కోయడం లేదా తినడం చేయరు.