KRNL: బీసీ, ఈబీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు కోడుమూరు ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాముడు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. 68 యూనిట్లకు 1,281 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీడీవో రాముడు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు బ్యాంకర్ల సహాయంతో నిర్వహించబడతాయని తెలిపారు.