SKLM: లావేరు శాఖా గ్రంధాలయంలో ఆదివారం యోగా శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మురపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతిరోజు యోగా చేయడంతో మానసిక ప్రశాంతతో పాటు ఏకాగ్రత లభిస్తుందన్నారు. పద్మాసనం, వజ్రాసనం, సూర్య నమస్కారాలతో పాటు సుమారు 32 ఆసనాలను విద్యార్థులచే వేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు, తదితరులు పాల్గొన్నారు.