NDL: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి శ్రీశైల పాదయాత్రలో భాగంగా ఆత్మకూరు పట్టణానికి చేరుకున్నారు. అక్కడ నుంచి వెంకటాపురం గ్రామంలోని శివాలయం, బైర్లూటి ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. మూర్తుజావల్లి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం కాలినడకన శ్రీశైల మల్లన్న సన్నిధికి బయలుదేరారు. ఆమె వెంట అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తరలివెళ్లారు.