W.G: భీమవరం పట్టణంలో కొలువైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారిని, భీమేశ్వర స్వామివారిని కాకినాడ దేవాదాయ ఉప కమిషనర్ డి.ఎల్.వి రమేశ్ బాబు శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన వార్షిక కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.