ATP: గుత్తి పట్టణ శివారులోని గేట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుత్తి ఎస్సై ఆశా బేగం మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రొజెక్టర్‌పై సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ జగదీష్ వివరిస్తున్న వీడియోను విద్యార్థులకు ప్రదర్శించారు.