ATP: అనంతపురంలో నిర్వహించిన అనంత బాలోత్సవం కార్యక్రమంలో గుత్తి ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి సర్టిఫికెట్లు అందుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉషా, గైడ్ రాధికా తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించారు. ఇలాగే ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.