పార్వతీ పురం జగన్నాధపురంలోని జనావాసాలకు అనుకొని మార్కెట్ యార్డ్లో జీడి పిక్కల క్రాసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని సీపీఎం నాయకులు గొర్లె వెంకట్రమణ, పాకల సన్యాసిరావు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. కొమరాడ గరుగుబిల్లి మండలాలు రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు 1974లో ఇది నియమించారు అన్నారు.