NLR: మద్దతు ధర కోల్పోయిన రైతులకు, ధాన్యం సేకరించడంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ సహాయ డైరెక్టర్ నర్సోజికి వినతిపత్రం సమర్పించారు. మద్దతు ధర లేక రైతులు తమ పంటలను నష్టానికి అమ్ముకుంటున్నారని అన్నారు. అధికారులు స్పందించాలని కోరారు.