NLR: తోటపల్లి గూడూరు మండలం పేడూరులో బీపీసీఎల్ పైప్ లైన్ నిర్మాణంతో పంట పొలాలు ధ్వంసం అయినట్లు స్థానికులు ఆదవేదన వ్యక్తం చేశారు. ఈ పొలాలను సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. పంట చేతికి వచ్చే సమయంలో ధ్వంసం చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కోతలు పూర్తయ్య వరకు పనులు నిలిపివేయాలని MLA నిర్వాహకులను కోరారు.