VZM: సాలూరు పట్టణంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం 25వార్డు రోడ్డు పక్కన ఉన్న చెత్తను మున్సిపల్ శానిటరి అధికారి పర్యవేక్షణలో జేసీబీతో తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు చెత్తను రోడ్డుపై వెయ్యకుండా చెత్త బుట్టలు వినియోగించాలని కోరారు. తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా ఉంచి, చెత్త కుండీలలో వెయ్యాలన్నారు.