NLR: నేటి నుంచి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలో భాషల పండుగ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 345 పాఠశాలలో ఎంపిక చేసిన భాషల వకృత్వ, వ్యాసరచన, కథలు చెప్పడం, రాయడం, చర్చా వేదికలు, సెల్ఫ్ చెక్, పాటలు పాడడం, డాన్సులు వేయడం, బోధనోపకరణాల తయారీ వంటి అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.