TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఏపీ మాజీ సీఎం జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఆయనకు ఆరోగ్యం, సంతోషకరమైన పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. అలాగే, కేసీఆర్ నిత్యం సంతోషంగా ఉండాలని, ప్రజలకు మరింతకాలం సేవ చేయాలని కోరుకుంటున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.