ASR: కొయ్యూరు మండలంలోని బకులూరు గ్రామానికి చెందిన బీ.రాజుబాబు అనే రిమాండ్ ఖైదీ మృతి చెందాడని ఎస్సై పీ.కిషోర్ వర్మ సోమవారం తెలిపారు. కోట్లాట కేసుకు సంబంధించి రాజుబాబు విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఊపిరి తిత్తులు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడిని జైలు సిబ్బంది కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.