HNK: వరంగల్-ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై విసుగు చెందిన ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.