GNTR: బెల్లంకొండ చండ్రాజుపాలెం NSP కాలువలో 3వ పెద్ద డ్రాపు వద్ద మొసలి సంచరిస్తున్నట్లు పలువురు చూడటంతో పరిసర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతపల్లి మేజర్ కాలువలో మొసళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈకాలువలో పాడి రైతులు పశువులను కడుగుతారని, యువకులు స్నానాలు చేస్తుంటారని అన్నారు. ఏప్పుడు ఏప్రమాదం సంభవిస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.