GNTR: నగరానికి చెందిన మస్తాన్ సాయి పోలీస్ కస్టడీ ముగియడంతో నార్సింగ్ పోలీసులు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్‌కి బానిసలుగా మార్చి యువతులపై అఘాయిత్యాలకు పాల్పడి నగ్న వీడియోలు తీసిన కేసులో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు మస్తాన్ సాయి సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేశారు.