BDK: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు, రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని కేవలం కార్పొరేట్ వర్గాల వారికి మాత్రమే ఉపయోగపడుతుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శరత్ బాబు అన్నారు. కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు.