BDK: ఛత్తీస్గఢ్ నుంచి చర్లకు వస్తున్న ఓ కుటుంబం సోమవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. చర్ల సరిహద్దుల్లో టూ-వీలర్, టాటా మ్యాజిక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న భద్రాచలం ఎమ్మెల్యే క్షతగాత్రులను పరిశీలించి, తన సహాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యేను స్థానికులు ప్రశంసించారు.