VZM: ఎల్కోట మండలం కిత్తన్నపేటలో పశు వైద్యాధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా 22 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు, 20 సాధారణ చికిత్సలు, 800 గొర్రెలు, మేకలకు, 46 పశువులకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే 5 పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు చేసినట్లు తెలిపారు.