కృష్ణా: చల్లపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణరావునగర్ కాలనీకి చెందిన పెయింటర్ దేవనమైన వెంకట వరప్రసాద్(21) మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. గత రెండు వారాలుగా పనికి వెళ్ళటం లేదని తల్లి మందలించటంతో ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.