కర్ణాటకలోని సింధనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కర్నూలు జిల్లా వాసులు మరణించారు. తుఫాను వాహనం బోల్తా పడి డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు రాత్రి మంత్రాలయం నుంచి హంపికి బయలుదేరారు. ప్రమాద సమయంలో వాహనంలో 14 మంది ఉన్నారు. ఘటనలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.