E.G: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం 2025లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అధికారులు సిబ్బందితో జిల్లా SP నరసింహకిషార్ మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చెయ్యి చెయ్యి కలుపుదామన్నారు. రహదారి భద్రతపై వాహనదారులు అవగాహన కలిగి ఉండాలాన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో సహకరించాలని కోరారు.