CTR:పలమనేరులో యోగి వేమారెడ్డి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పలమనేరు పట్టణంలోని నాగమంగళం వద్దనున్న యోగి వేమారెడ్డి ఉద్యానవనంలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగివేమన విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం వందకు పైగా వేమన పద్యాలు ఆలపించిన చిన్నారులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతిని అందజేశారు.